- దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ
దుబాయ్ : ఏటిపి-500 దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ సెమీఫైనల్లోకి అలెగ్జాండర్ జ్వెరేవ్ ప్రవేశించాడు. గురువారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో జ్వెరేవ్.. 7-5, 6-4తో వరుససెట్లలో లోరెంజో సొనెగోపై విజయం సాధించాడు. ఈ మ్యాచ్ గంటా 52నిమిషాలసేపు సాగింది. జర్మనీకి చెందిన 7వ ర్యాంకర్ అయిన జ్వెరేవ్ రెండోసారి మాత్రమే దుబారు ఓపెన్ టోర్నీ సెమీఫైనల్లోకి దూసుకొచ్చాడు. తొలి సెట్‌లో 5వ గేమ్‌ను బ్రేక్‌ను బ్రేక్ చేసిన జ్వెరేవ్.. మొత్తం ఆరు బ్రేక్ పాయింట్లు సాధించాడు. సెమీస్‌లో జ్వెరేవ్ డిఫెండింగ్ ఛాంపియన్ ఆండీ రుబ్లేవ్(రష్యా)తో తలపడనున్నాడు. ఇక టాప్‌సీడ్ నొవాక్ జకోవిచ్ సెమీస్ బెర్త్‌ను ఇప్పటికే సాధించగా.. మరో బెర్త్‌కోసం హుర్క్రరాజ్-మెద్వదేవ్‌ల మధ్య క్వార్టర్‌ఫైనల్ పోటీ జరగనుంది.










