Oct 24,2023 14:32

అమరావతి: సామాజిక సాధికార యాత్ర పేరుతో ఈ నెల 26 నుంచి వైఎస్సార్‌సీపీ బస్సు యాత్రలు నిర్వహించనున్నారు. మూడు ప్రాంతాల్లోనూ ఒకేసారి బస్సు యాత్రలు ప్రారంభకాన్నాయి. ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం, కోస్తాంధ్రలో తెనాలి నుంచి.. రాయలసీమలో సింగనమల నుంచి బస్సు యాత్రలు ప్రారంభకానున్నాయి. నాలుగున్నరేళ్లలో జరిగిన అభివఅద్ధి, సంక్షేమాలపై ప్రచారం చేపట్టనున్నారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేసిన మేళ్లను వివరించనున్నారు. ప్రతి రోజు మూడు ప్రాంతాల్లోనూ మూడు సభలు నిర్వహించనున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, సమన్వయకర్తల ఆధ్వర్యంలో బస్సు యాత్రలు ప్రారంభం కానుండగా, 175 నియోజకర్గాల్లో గెలుపే లక్ష్యంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ నేతలు చెబుతున్నారు.