May 29,2023 15:41

జూన్‌ 7-11 వరకు ఇంగ్లండ్‌ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరగనుంది. ఇప్పటికే భారత జట్టు ప్రకటించగా తాజాగా ఆస్ట్రేలియా 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. తొలుత 17 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసిన బోర్డు.. జట్టులో ఉన్న మిచెల్‌ మార్ష్‌, మ్యాట్‌ రెన్షాలను తప్పించింది.
ఆస్ట్రేలియా తాజా జట్టు:
పాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), స్కాట్‌ బోలాండ్‌, అలెక్స్‌ క్యారీ, కామెరాన్‌ గ్రీన్‌, మార్కస్‌ హారిస్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, ట్రవిస్‌ హెడ్‌, జోష్‌ ఇంగ్లిస్‌, ఉస్మాన్‌ ఖవాజా, మార్నస్‌ లబుషేన్‌, నాథన్‌ లియోన్‌, టాడ్‌ మర్ఫీ, స్టీవ్‌ స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌, డేవిడ్‌ వార్నర్‌.