మెన్స్ క్రికెట్ వరల్డ్‌కప్ 2023 (వన్డే ఫార్మాట్) క్వాలిఫయర్స్ షెడ్యూల్‌ను ఐసీసీ కొద్ది సేపటి క్రితం (మే 23) విడుదల చేసింది. జింబాబ్వే వేదికగా జరుగనున్న ఈ టోర్నీ జూన్ 18 నుంచి జులై 9 వరకు జరుగనుంది. మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నీలో 5-5 జట్లు రెండు గ్రూపులుగా విభజించబడ్డాయి.
గ్రూప్-ఏ : జింబాబ్వే, వెస్టిండీస్, ద నెదార్లండ్స్, నేపాల్, యునైటెడ్ స్టేట్స్
గ్రూప్-బి : శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్, ఒమన్, యూఏఈ జట్లుఉన్నాయి.
భారత్ వేదికగా ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే ప్రపంచకప్‌కు 8 జట్లు ఇదివరకే అర్హత సాధించిన విషయం తెలిసిందే. భారత్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా జట్లు ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాయి. ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు.











