Mar 04,2023 11:39

ఆరంభ డబ్ల్యుపిఎల్‌ రేపటినుంచే..
తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ × ముంబయి

ముంబయి: భారత క్రికెట్‌ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న తొలి మహిళల ప్రిమియర్‌ లీగ్‌(డబ్ల్యుపిఎల్‌) శనివారం నుంచి ప్రారంభం కానుంది. ముంబయిలోని రెండు వేదికల్లోనే డబ్ల్యుపిఎల్‌ టోర్నీ ముగియనుంది. అగ్రశ్రేణి మహిళా క్రికెటర్లందరూ ఈ టోర్నీ బరిలోకి దిగడం.. ఫ్రాంచైజీలు వారిను కొనుగోలు చేసుకొనేందుకు కోట్లాది రూపాయలు కుమ్మరించడంతో డబ్ల్యుపిఎల్‌కు క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. మొత్తం ఐదుజట్ల మధ్య డబ్ల్యుపిఎల్‌ టైటిల్‌కై తలపడనున్నాయి. ప్రస్తుతం అమ్మాయిల క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరగడంతో ఈ టోర్నీ పోటా పోటీగా సాగడం ఖాయం.
షెడ్యూల్‌...
తేది ఎవరెవరికి? వేదిక సమయం
4(శని) గుజరాత్‌ × ముంబయి డివై పాటిల్‌ రా.7.30గం||లకు
5(ఆది) బెంగళూరు × ఢిల్లీ బ్రాబౌర్న్‌ మ.3.30గం||లకు
యుపి × గుజరాత్‌ డివై పాటిల్‌ రా.7.30గం||లకు
6(సోమ) ముంబయి × బెంగళూరు బ్రాబౌర్న్‌ రా.7.30గం||లకు
7(మంగళ) ఢిల్లీ × యుపి డివై పాటిల్‌ రా.7.30గం||లకు
8(బుధ) గుజరాత్‌ × బెంగళూరు బ్రాబౌర్న్‌ రా.7.30గం||లకు
9(గురు) ఢిల్లీ × ముంబయి డివై పాటిల్‌ రా.7.30గం||లకు
10(శుక్ర) బెంగళూరు × యుపి బ్రాబౌర్న్‌ రా.7.30గం||లకు
11(శని) గుజరాత్‌ × ఢిల్లీ డివై పాటిల్‌ రా.7.30గం||లకు
12(ఆది) యుపి × ముంబయి బ్రాబౌర్న్‌ రా.7.30గం||లకు
13(సోమ) ఢిల్లీ × బెంగళూరు డివై పాటిల్‌ రా.7.30గం||లకు
14(మంగళ) గుజరాత్‌ × ముంబయి బ్రాబౌర్న్‌ రా.7.30గం||లకు
15(బుధ) యుపి × బెంగళూరు డివై పాటిల్‌ రా.7.30గం||లకు
16(గురు) గుజరాత్‌ × ఢిల్లీ బ్రాబౌర్న్‌ రా.7.30గం||లకు
18(శని) యుపి × ముంబయి డివై పాటిల్‌ మ.3.30గం||లకు
గుజరాత్‌ × బెంగళూరు బ్రాబౌర్న్‌ రా.7.30గం||లకు
20(సోమ) గుజరాత్‌ × యుపి బ్రాబౌర్న్‌ మ.3.30గం||లకు
ఢిల్లీ × ముంబయి డివై పాటిల్‌ రా.7.30గం||లకు
21(మంగళ) బెంగళూరు × ముంబయి డివై పాటిల్‌ మ.3.30గం||లకు
యుపి × ఢిల్లీ బ్రాబౌర్న్‌ రా.7.30గం||లకు
24(శుక్ర) ఎలిమినేటర్‌-1 డివై పాటిల్‌ రా.7.30గం||లకు
26(ఆది) ఫైనల్‌ బ్రాబౌర్న్‌ రా.7.30గం||లకు