కేప్‌టౌన్ : టీ-20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ భారత మహిళ క్రికెట్ జట్లు ఇంగ్లాండ్‌తో తలపడనుంది. టోర్నీలో ఇప్పటి వరకు భారత్, ఇంగ్లండ్ చెరో రెండు విజయాలతో అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో భారత జట్టు నాకౌట్ పై గురి పెట్టింది. దక్షిణాఫ్రికలోని గెబెరా వేదికగా ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆడిన పాకిస్తాన్, వెస్టిండీస్‌లతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత్ ఇంగ్లండ్‌పై విజయం సాధిస్తే దాదాపుగా సెమీఫైనల్స్‌కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియాను స్టార్ ఓపెనర్ స్మతి మంధాన ఫామ్ కలవరపెడుతోంది. జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌లు రాణిస్తుండటం భారత్‌కు సానుకూలమని విషయం. ఇక బౌలింగ్‌లో దీప్త శర్మ క్రమం తప్పకుండా వికెట్లు తీస్తుంది. రేణుక సింగ్, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్‌లతో భారత బౌలింగ్ బలంగా కనిపిస్తోంది.
టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్: హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), యస్తికా బాటియా, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్లిన్ డియోల్, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ, రేణుకా సింగ్, రాధా యాదవ్, శిఖా పాండే










