Mar 04,2023 15:27

ముంబై : మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)కు రంగం సిద్ధమైంది. ఈ మెగా లీగ్‌ ఈ రోజే మొదలవుతుంది. డబ్ల్యూపీఎల్‌ మొదటి సీజన్‌లో ఐదు జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో మొత్తం 22 మ్యాచ్‌లు ఉండగా.. ఈ రోజు జరిగే తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌, ముంబై ఇండియన్స్‌ తలపడనున్నాయి. కాగా తొలి మ్యాచ్‌ షెడ్యూల్‌లో మార్పు చేసినట్టు బీసీసీఐ ప్రకటించింది. ఈ మ్యాచ్‌ రాత్రి 7.30కి మొదలు కావాల్సి ఉండగా.. అరగంట ఆలస్యంగా రాత్రి 8 గంటలకు మొదలవుతుందని తెలిపింది. అలాగే, మ్యాచ్‌కు ముందు ప్రారంభోత్సవాన్ని సాయంత్రం 5.30 గంటలకు కాకుండా 6.25 గంటలకు ప్రారంభం అవుతుందని తెలిపింది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌ స్టార్స్‌ కృతి సనన్‌, కియారా అద్వానీతో పాటు కెనడా పాప్‌ సింగర్‌ ఏపీ ధిల్లాన్‌ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ఈ టోర్నీలోని మిగతా మ్యాచ్‌లు ముందుగా నిర్ణయించిన సమయానికే జరుగుతాయి. రాత్రి మ్యాచ్‌ 7.30 గంటలకు, డబుల్‌ హెడర్‌లో మొదటి మ్యాచ్‌ మధ్యాహ్నం 3.30 గంటలకు మొదలవుతుంది.