ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉమెన్‌చాందీ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటని పిసిసి రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో ఉమెన్‌చాందీ సంతాపసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు షేక్ మస్తాన్‌వలి, సుంకర పద్మశ్రీ, రాకేష్‌రెడ్డి పాల్గొన్నారు.