Sep 21,2023 15:15

హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ మహాగణపతి దర్శనం కోసం బయలుదేరిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్‌కు చెందిన యశ్వంత్‌ (22) డిగ్రీ చదువుతున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన సాయిరామ్‌ (31) డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వీరిద్దరూ స్నేహితులు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఖైరతాబాద్‌ గణపతిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో.. యశ్వంత్‌, సాయిరామ్‌ స్పోర్ట్స్‌ బైక్‌పై బోడుప్పల్‌ నుంచి బయలుదేరారు. అడిక్‌మెట్‌ ఫ్లైఓవర్‌పై అతివేగంగా బైక్‌ నడిపి డివైడర్‌ను డీ కొట్టారు. ఈ ప్రమాదంలో బైక్‌ నడిపిన యశ్వంత్‌ అక్కడికక్కడే మఅతి చెందాడు. తీవ్ర గాయాలైన సాయిరామ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఉస్మానియా వర్సిటీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మఅతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు.