Sep 08,2022 08:26
  • ఆదాయర 34,407 కోట్లు శ్రీ వ్యయం 64,457 కోట్లు
  • లెక్కలు తేల్చిన ఆర్థికశాఖ, ఎజి

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలోని తొలి త్రైమాసికం పరిస్థితి దయనీయంగా ఉరది. తాజాగా అక్కౌరటెరట్‌ జనరల్‌ కార్యాలయం ప్రకటిరచిన వివరాల మేరకు ఆదాయం కన్నా వ్యయం రెట్టిరపుగా ఉరది. లోటు కూడా భారీగా నమోదైంది. ఎజి కార్యాలయ లెక్కల ప్రకారం తొలి మూడు నెలల్లో 34,407 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఇరదులో సొరత పన్నుల ఆదాయం 23,436 కోట్లుగా ఉరడగా, పన్నేతర ఆదాయం 966 కోట్లరూపాయలు. ఇక కేంద్రర నురచి గ్రారట్ల రూపంలో 10,005 కోట్ల రూపాయలు వచ్చాయి. అయితే ప్రభుత్వం చేసిన ఖర్చు మాత్రం రూ. 64,458 కోట్లుగా ఎజి కార్యాలయం తేల్చింది. అరటే ఆదాయం కన్నా 30, 051 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేసినట్టయిరది. ఈ అదనపు ఖర్చులో 30,044 కోట్లను రుణాల రూపేణా సమకూర్చుకున్నట్లు వెల్లడైరది. కాగా మొత్తం వ్యయంలో ఏకంగా 60,843 కోట్లు రెవిన్యూ వ్యయంగానూ, కేవలం 2, 149 కోట్లు రూపాయలు మాత్రమే పెట్టుబడి వ్యయంగానూ ఖర్చు చేశారు. ఇక లోటు కూడా మూడు నెలల్లోనే రికార్డు స్థాయిలో నమోదుకావడం విశేషం. ఆదాయ లోటు 26,436 కోట్లుగా నమోదుకాగా, ద్రవ్యలోటు 30,044 కోట్లుగా నమోదుకావడం గమనార్హం.

table