ఐపీఎల్-2023లో ఎలిమినేటర్ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. బుధవారం చెన్నై వేదికగా జరగనున్న ఈ కీలక పోరులో లక్నో సూపర్ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు మే 26న జరగనున్న క్వాలిఫియర్-2లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. అంతే కాకుండా ఐపీఎల్‌లో ఇప్పటివరకూ ముంబైతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ లఖ్‌నవూ గెలిచింది. మరి చెపాక్‌లో ఏ జట్టు విజయ సాధించి గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుందో వేచి చూడాలి.
తుది జట్లు(అంచనా)
లక్నో: క్వింటన్ డి కాక్, కైల్ మేయర్స్, ప్రేరక్ మన్కడ్, ఆయుష్ బదోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కనాల్ పాండ్యా, కష్ణప్ప గౌతమ్, యశ్ ఠాకూర్, మొహ్సిన్ ఖాన్, రవి బిష్ణోరు
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నేహాల్ వధేరా, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండోర్ఫ్, ఆకాష్ మధ్వల్, హతిక్ షోకీన్










