వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మరో పది రోజుల్లో ప్రారంభం కానుంది. జూన్ 7 నుంచి లండన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఇరు జట్లనుంచి అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, ఉస్మాన్ ఖవాజా, ఫస్ట్‌డౌన్‌లో మార్నస్ లాబుషేన్, సెకెండ్ డౌన్‌లో విరాట్ కోహ్లికి ఛాన్స్ దక్కింది. నాలుగు ఐదు స్థానాల్లో స్టీవ్ స్మిత్, రవీంద్ర జడేజా ఎంపికయ్యారు. బౌలర్ల కోటాలో పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లయాన్, మహ్మద్ షమీకు అవకాశం దక్కింది. వికెట్ కీపరగా అలెక్స్ కారీని ఎంచుకున్నాడు. ఈ జట్టుకు రోహిత్ శర్మను కెప్టెన్‌గా పాంటింగ్ ఎంచుకున్నాడు.
జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగే, విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, రవీంద్ర జడేజా, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, మహ్మద్ షమీ










