Mar 01,2023 09:51

ఇండోర్‌ : బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీలో వరుసగా రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా మూడో టెస్టుకు సిద్ధమైంది. ఇండోర్‌ వేదికగా జరిగే ఈ మూడో టెస్టులోనూ కంగారులను ఓడించి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ బెర్తుని ఖాయం చేసుకునేందుకు భారత్‌ ఉత్తేజంతో ముందడుగు వేసింది. ఉత్కంఠంగా ప్రారంభమైన ఈ పోరులో విజయమే లక్ష్యంగా భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆస్ట్రేలియాను బౌలింగ్‌ కు ఆహ్వానించింది.

భారత్‌ తుది జట్టు : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, పుజారా, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, రవీంద్ర జడేజా, శ్రీకర్‌ భరత్‌, అశ్విన్‌, అక్షర్‌, ఉమేశ్‌, సిరాజ్‌.

ఆస్ట్రేలియా తుది జట్టు : ట్రావిస్‌ హెడ్‌, ఉస్మాన్‌ ఖవాజా, లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌ (కెప్టెన్‌), హాండ్స్‌కాంబ్‌, గ్రీన్‌, కేరీ, స్టార్క్‌, మర్ఫీ, లైయన్‌, కునెమన్‌.