Sep 11,2023 13:38

ఇంటర్నెట్‌డెస్క్‌ : సోషల్‌మీడియా వల్ల యువత అనారోగ్యపాలవుతున్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మొబైల్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ వంటి వాటిని నేటి యువత ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల శారీరక, మానసిక సమస్యలు ఎక్కువవుతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ 4,500 మంది 10 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న యువత చనిపోతున్నారని డబ్ల్యుహెచ్‌ లెక్కలు చెబుతున్నాయి. సోషల్‌ మీడియా మాత్రమే కాదు.. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కూడా యువత ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.

1) సోషల్‌ మీడియాలోని సమాచారం వల్ల యువత అతిగా స్పందించడం, లేక ఒత్తిడికి లోనవ్వడం జరుగుతుంది. దీంతో యువత మానసిక సమస్యలకు లోనవుతున్నారని వైద్యులు సూచిస్తున్నారు.
2) సరైన ఉద్యోగాల కోసం కానీ, తీర్చాల్సిన స్టూడెంట్‌ బ్యాంక్‌ లోన్స్‌ వంటి ఆర్థిక సమస్యల వల్ల యువత అనారోగ్యానికి గురవుతున్నారని వైద్యులు తెలిపారు.
3) ఫాస్ట్‌ఫుడ్స్‌, వ్యాయామం లేకపోవడం, జీవనశైలిలో మార్పులు, తమకి సరిపడని రిలేషన్‌షిప్స్‌ వల్ల కూడా యువత త్వరగా అనారోగ్యానికి గురవుతున్నారు.


యువత ఆరోగ్యంగా ఉండాలంటే..?!
నేటి జీవన శైటిలో మార్పుల వల్ల యువత అనారోగ్యంపై ప్రభావం పడుతుంది. అందుకే జీవన శైలిలో తప్పనిసరిగా మార్పులు చేసుకోవాలి. ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరి. మొబైల్‌, సోషల్‌మీడియా ఉపయోగించడం వంటివి అవసరానికి మించి ఉపయోగించకూడదు అని వైద్యులు సూచిస్తున్నారు. చదువుపరంగా ఏమైనా సందేహాలు ఉంటే తప్పనిసరిగా.. వారి సీనియర్లను కానీ.. టీచర్స్‌తో కానీ అడిగి వాటిని నివృత్తి చేసుకోవాలి. ప్రధానంగా ఒంటరితనానికి లోనుకాకూడదు. ఆర్థిక విషయాల్లో తల్లిదండ్రుల జోక్యం తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు.