హైదరాబాద్: సెప్టెంబర్ 17న తుక్కుగూడలో జరిగే విజయభేరి సభలో ఎలాంటి చేరికలు ఉండవని టీపీసీసీ పేర్కొంది. ఆ సభ కేవలం ఆరు గ్యారంటీల ప్రకటన కోసం ప్రత్యేకించినది తెలిపింది. కాంగ్రెస్‌లో చేరాలనుకుంటున్న నేతలు ఎక్కడికక్కడ చేరికలు జరగాలని వెల్లడించింది. ఈరోజు ఉదయం 10 గంటలకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో జిట్టా బాలకృష్ణ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు కోమటిరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సాయంత్రం తాజ్‌కృష్ణ హోటల్‌లో జరిగే సీడబ్ల్యూసీ సమావేశంలో మల్లికార్జున ఖర్గే సమక్షంలో తుమ్మల పార్టీలో చేరనున్నారు. అనంతరం సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలను తుమ్మల కలవనున్నారు. మరికొందరు తాజ్ కృష్ణ హౌటల్‌లోనే కాంగ్రెస్ అగ్ర నాయకుల సమక్షంలో పార్టీలో చేరనున్నారు.










