వెస్టిండీస్ టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో భారత వెటరన్ ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్‌కు చోటు దక్కకపోయిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్లో అంతగా అకట్టుకోపోయిన ఉమేశ్ యాదవ్‌ను ఉద్దేశపూర్వకంగానే జట్టు నుంచి తప్పించారని బిసిసిఐ విమర్శలు వస్తున్నాయ. తాజాగా ఈ విమర్శలపై బీసీసీఐ వర్గాలు స్పందించాయి. ఉమేశ్ కావాలని తప్పించలేదని, అతడు మోకాలి గాయంతో బాధపడుతున్నాడని అందుకే విండీస్ టూర్‌కు పరిగణలోకి తీసుకోలేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ''ఉమేశ్ యాదవ్ ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. అతడు బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. అతడు ఇంకా సెలక్టర్లు దృష్టిలో ఉన్నాడు'' అని బీసీసీఐ అధికారి ఒకరు టైమ్స్ ఇండియాతో పేర్కొన్నారు.










