Jul 07,2023 10:46

న్యూఢిల్లీ : దేశంలో అత్యంత సంపన్నులు భారీగా పెరుగొచ్చని ఓ రిపోర్ట్‌ తెలిపింది. అదే విధంగా మధ్యతరగతి వర్గం పెరుగుతుందని పేర్కొంది. 2031 నాటికి పేదలు సగానికి తగ్గొచ్చని పీపుల్స్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఇండియాస్‌ కన్య్సూమర్‌ ఎకానమీ అండ్‌ ఇండియన్‌ సిటిజన్‌ ఎన్విరాన్‌మెంట్‌ పేర్కొంది. 25 రాష్ట్రాల్లో 40,000 కంటే ఎక్కువ మంది వ్యక్తుల అభిప్రాయాలతో ఈ రిపోర్ట్‌ను రూపొందించినట్లు వెల్లడించింది. వచ్చే తొమ్మిదేళ్లలో ధనవంతుల కుటుంబాలు 91 లక్షలకు చేరొచ్చొని అంచనా వేసింది.
         మరోవైపు అత్యంత సంపన్న కుటుంబాల్లో ఐదు రెట్ల పెరుగుదల ఉండొచ్చని తెలిపింది. 2021 నాటికి సంవత్సరానికి రూ.2 కోట్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్న అత్యంత ధనవంతుల కుటుంబాల సంఖ్య ఐదేళ్లలో 18 లక్షలకు చేరి.. రెట్టింపు కావొచ్చని అంచనా వేసింది. గ్రామాల్లో ధనవంతుల కుటుంబాల వృద్థి 14.2 శాతంగా, నగరాల్లో 10 శాతం ఉండొచ్చని పేర్కొంది.