- ఆదాయం రూ.14,533 కోట్లు
- వ్యయం రూ.46,896 కోట్లు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ఈ ఆర్థిక సంవత్సరంలో రెరడు నెలల్లో రూ.32,363 కోట్లు లోటు ఏర్పడింది. మే నెల్లో మొత్తం ఆదాయం రూ.6,386 కోట్లు కాగా, వ్యయం రూ.26,576 కోట్లుగా నమోదుకావడంతో రూ.20,190 కోట్లు లోటుగా లెక్కలు తేలాయి. ఈ లోటును బహిరంగ మార్కెట్ రుణాల ద్వారా సేకరిరచిన దాదాపు రూ.15 వేలకోట్లతో, ఇతర సంస్థల నురచి సేకరిరచిన మరో రూ.5 వేలకోట్లతో కలిపి భర్తీ చేసింది. గతంలో రూ.15 వేలకోట్ల నురచి రూ.20 వేలకోట్ల వరకు లోటు కనిపిరచినా, రూ.30 వేలకోట్లు దాటడం ఇదే మొదటిసారి అని అధికారులు అంటున్నారు. తొలి రెరడు నెలల్లో అనుకున్న ఆదాయం తగ్గడమే ఇరదుకు కారణంగా అధికారులు చెబుతున్నారు.
నెల ఆదాయం వ్యయం లోటు
ఏప్రిల్ 8,147 20,320 12,173
మే 6,386 26,576 20,190
మొత్తం 14,533 46,896 32,363










