Oct 10,2023 09:50

ప్రజాశక్తి - కురుపాం (మన్యం) : మండలంలో గొటివాడ గిరిజన గ్రామంలో సోమవారం అర్ధరాత్రి క్షుద్ర పూజల ఘటన కలకలం రేపింది. మంగళవారం ఉదయం స్థానిక గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ... గోటివాడ గ్రామ పరిధిలో ఉన్న స్మశానవాటిక వద్ద అర్ధరాత్రి 12 గంటల సమయంలో నాలుగు బైక్‌లపై 9మంది వచ్చి కత్తులు, పసుపు, కుంకుమలతో క్షుద్రపూజలు చేస్తుండగా గ్రామస్తులు గమనించి వారందరినీ పట్టుకున్నారు. వారిలో ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు. వారంతా బైక్‌లపై వచ్చారనీ, వారి ఊర్లు అడుగుతుంటే, పెంగావా, రాయఘడాజమ్మ అంటూ... సరైన సమాధానం చెప్పడం లేదని అన్నారు. వారిని గ్రామంలోనే ఉన్న పోలీస్‌ స్టేషన్‌కు అప్పగించి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.