Feb 11,2023 11:59

నాగ్‌పూర్‌ : ఆస్ట్రేలియా స్పిన్నర్‌ టాడ్‌ మర్ఫీ తన అరంగేట్ర టెస్టులోనే అద్భుతమైన ప్రదర్శన చేసి 141 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. నాగ్‌పూర్‌ వేదికగా భారత్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో మర్ఫీ.. తొలి ఇన్నింగ్స్‌లో 124 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. రెండో రోజు ఆట సందర్భంగా తన తొలి ఐదు వికెట్లు హాల్‌ సాధించిన మర్ఫీ.. మూడో రోజు ఆటలో మరో రెండు వికెట్లతో చేలరేగిపోయాడు. ఇక టెస్టుల్లో ఐదు వికెట్ల హాల్‌ సాధించిన అతి పిన్న వయస్కుడైన ఆస్ట్రేలియా స్పిన్నర్‌గా మర్ఫీ రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ జోరు ప్లామర్‌ పేరిట ఉండేది. ప్లామర్‌ 1882లో ఇంగ్లండ్‌తో జరగిన ఓ టెస్టు మ్యాచ్‌లో 22 ఏళ్ల 360 రోజుల్లో ఐదు వికెట్ల ఘనతను సాధించాడు. ఇక 22 ఏళ్ల 87 రోజుల వయస్సులోనే ఈ ఘనతను సాధించిన మర్ఫీ.. 141 ఏళ్ల ప్లామర్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు.