Oct 10,2023 08:23
  • ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వెల్లడి
  • డిసెంబరు 3న ఫలితాలు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో మరోసారి ఎన్నికల సందడి మొద లైంది. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నవంబరు 30న జరగనున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. సోమవారం నాడిక్కడ ఆకాశవాణి భవన్‌లోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ వివరాలను సిఇసి చీఫ్‌ రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు. తెలంగాణ, రాజస్థాన్‌, మిజోరాం, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఒకే దశలోనూ, చత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లోనూ ఎన్నికలు నిర్వహించ నున్నట్లు తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. 'ఎన్నికల కోసం ఆరు నెలలుగా కసరత్తు చేస్తున్నాం. వివిధ రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు సేకరి ంచాం. ఐదు రాష్ట్రాల అధికారులు, పార్టీల నేతలతో చర్చలు జరిపాం. ఐదు రాష్ట్రాల్లో మొత్తం 679 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తాం. 60 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు పొందారు. మహిళా ఓటర్ల సంఖ్య పెరిగింది. 1.77 లక్షల పోలిం గ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశాం. 16.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అందులో 8.2 కోట్ల పురుషు లు, 7.8 కోట్ల మహిళలు ఉన్నారు. 20,59,539 ఓట్లు తొలగిం చాం. 57,89,227 కొత్త ఓటర్లు జత చేశాం. 18.37 లక్షల మంది 18-19 ఏళ్ల వయసు గల ఓటర్లను జత చేశాం. ఈ ఎన్నికల్లో వృద్ధులకు ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం కల్పించాం. ఐదు రాష్ట్రాల్లో తక్షణమే సోమవారం నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుంది' అని రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు.
 

                                                                  పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం

ఎలాంటి ప్రలోభాలు లేకుండా స్వేచ్ఛగా సక్రమంగా ఎన్నికలు జరిగేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని రాజీవ్‌ కుమార్‌ ప్రకటించారు. రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే ఉచితాలకు ప్రజాకర్షణ చాలా వుంటుంద ని, ఎన్నికల్లో గెలిచిన వారు వాటిని అమలు చేయడం, లేదా ఈ పద్ధతిని ఆపడం చాలా కష్టమని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు వివిధ పార్టీలు, ప్రభుత్వాలు ప్రకటించే ఉచితాలపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి అవకతవక లు, ఫిర్యాదులైనా సి విజిల్‌ యాప్‌లో రిపోర్ట్‌ చేయాల్సింది గా ఇసి ఓటర్లను కోరింది. ప్రతి ఒక్క ఫిర్యాదుకు వంద నిముషాల్లోనే స్పందన వస్తుందని తెలిపింది.

22