టీ20ల్లో 3 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌లో దూసుకుపోతున్న సూర్యకుమార్ యాదవ్, ఆరంగ్రేటం చేసిన రెండో ఏడాదిలోనే ఐసీసీ అవార్డు సొంతం చేసుకున్నాడు. గత ఏడాది 31 టీ20 మ్యాచులు ఆడిన సూర్యకుమార్ యాదవ్ 46.56 సగటుతో 1164 పరుగులు చేశాడు. సూర్య స్ట్రైయిక్ రేటు 187.43గా ఉంది. టీమిండియా నుంచి ఐసీసీ టీ20 మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్న మొట్టమొదటి క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.. ఇంతకుముందు విరాట్ కోహ్లీ, ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా మూడు సార్లు, మహేంద్ర సింగ్ ధోనీ 2 సార్లు, రోహిత్ శర్మ ఓ సారి ఐసీసీ అవార్డులు గెలిచారు.










