లక్నోలో గతవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా కేఎల్ రాహుల్ గాయపడ్డ విషయం తెలిసిందే.. అతని కుడి తొడకు అయిన గాయానికి మంగళవారం శస్త్ర చికిత్స జరిగింది. ఈ విషయాన్ని రాహుల్ బుధవారం స్వయంగా వెల్లడించాడు. వీలైనంత త్వరగా మైదానంలోకి రావాలని ఎదురుచూస్తున్నానని రాహుల్ పేర్కొన్నాడు. శస్త్ర చికిత్స సజావుగా జరిగినందుకు వైద్యులు, వైద్య సిబ్బందికి రాహుల్ కతజ్ఞతలు తెలిపారు. గాయం వల్ల అతను ఐపీఎల్‌తో పాటు జూన్‌లో ఆస్ట్రేలియాతో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో ఇషాన్ కిషన్‌ను భారత జట్టులోకి తీసుకున్నారు.
09.05.23 pic.twitter.com/r0CxIbhVfD
— K L Rahul (@klrahul) May 9, 2023










