Oct 10,2023 10:15

ప్రజాశక్తి-అమరామతి బ్యూరో : బిజెపిని వ్యతిరేకించే పార్టీలకే మద్దతు ఉంటుందని రెవెల్యూషనరీ సోషలిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు జానకి రాములు అన్నారు. విజయవాడలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో కానీ, కేందంలో కానీ బిజెపిని వ్యతిరేకించే పార్టీలకు మద్దతు ఉంటుందన్నారు. ప్రజా ఉద్యమాలు చేస్తున్న వారిపై పోలీసు యంత్రాంగం అక్రమ కేసులు పెట్టి ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతుందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి, వైసిపిని ఓడించాలన్నారు. ఈ సమావేశం లో నాయకులు సుబ్బారాయుడు, కళ్యాన్‌ ఓబులే సు, నరసింహారావు, నాగేంద్ర, దాసరి ప్రసాద్‌, మహేష్‌, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.