May 18,2023 17:35

హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్‌తో ఆర్‌సిబి అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆర్‌సిబి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో సన్‌రైజర్‌ తొలుత బ్యాటింగ్‌ చేయనుంది. కాగా ఈ మ్యాచ్‌లో ఆర్‌సిబి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది.

ఆర్‌సిబి : ఫాఫ్‌ డు ప్లెసిస్‌ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, అనుజ్‌ రావత్‌, మహిపాల్‌ లోమ్రోర్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, దినేష్‌ కార్తీక్‌ (వికెట్‌ కీపర్‌), మైకేల్‌ బ్రేస్‌వెల్‌, వేన్‌ పార్నెల్‌, హర్షల్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌, కర్ణ్‌ శర్మ

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ : అభిషేక్‌ శర్మ, రాహుల్‌ త్రిపాఠి, ఐడెన్‌ మార్క్‌రామ్‌ (కెప్టెన్‌), హెన్రిచ్‌ క్లాసెన్‌ (వికెట్‌ కీపర్‌), అబ్దుల్‌ సమద్‌, సన్విర్‌ సింగ్‌, మార్కో జాన్సెన్‌, మయాంక్‌ మార్కండే, భువనేశ్వర్‌ కుమార్‌, ఫజల్హాక్‌ ఫరూకీ, టి నటరాజన్‌

  • సన్‌రైజర్స్‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అమీతుమీ

ఐపీఎల్‌ 2023లో భాగంగా ఇవాళ (మే 18) మరో కీలక మ్యాచ్‌ జరుగనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్‌తో ఆర్‌సిబి అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడితే ప్లే ఆఫ్స్‌కు చేరకుండా లీగ్‌ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉంది. అందుకే ఆర్‌సిబి ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్‌ అవకాశాలు కాపాడుకోవాలని చూస్తోంది.