ఐపీఎల్ 2023 సీజన్ తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 182 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగుల ఓ మాదిరి స్కోరు చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత అభిషేక్ శర్మ 5 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన యుద్‌వీర్ శర్మ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 13 బంతుల్లో 4 ఫోర్లతో 20 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి, యష్ ఠాకూర్ బౌలింగ్‌లో క్వింటన్ డి కాక్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అన్‌మోల్ ప్రీత్ సింగ్, అమిత్ మిశ్రా బౌలింగ్‌లో 36 పరుగులు చేసిన అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 20 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 28 పరుగులు చేసిన కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్, కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. గత మ్యాచ్‌లో మెరుపులు మెరిపించిన గ్లెన్ ఫిలిప్స్‌ని ఆ తర్వాతి బంతికే క్లీన్ బౌల్డ్ చేశాడు కనాల్ పాండ్యా.. 29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 47 పరుగులు చేసిన హెన్రీచ్ క్లాసిన్, ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అబ్దుల్ సమద్ 25 బంతుల్లో ఓ ఫోర్, 4 సిక్సర్లతో 37 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
Innings Break!@SunRisers set a challenging target of 183 for #LSG 👌🏻👌🏻
— IndianPremierLeague (@IPL) May 13, 2023
Will @LucknowIPL successfully chase this down? We will find out soon!
Scorecard ▶️ https://t.co/CPUJyBdGYU #TATAIPL | #SRHvLSG pic.twitter.com/fFOw5p5S2V
- హెన్రిచ్ క్లాసెన్ ఔట్
29 బంతుల్లో 47 పరుగులు చేసిన హెన్రిచ్ క్లాసెన్ ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో ప్రేరక్ మన్కడ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరారు. క్లాసెన్ ఇన్నింగ్స్‌లో 3 సిక్స్‌లు, 3 ఫోర్లు ఉన్నాయి. క్రీజులోకి భూవీ వచ్చాడు. అబ్దుల్ సమాద్ 30 పరుగుల మీద బ్యాటింగ్ చేస్తున్నాడు.
- 17 ఓవర్లకు సన్‌రైజర్స్ 154/5
17 ఓవర్లు పూర్తయ్యే సరికి సన్‌రైజర్ 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ 40, అబ్దుల్ సమద్ 18 పరుగుల మీద బ్యాటింగ్ చేస్తున్నారు. అంతకు ముందు అన్మోల్‌ప్రీత్ సింగ్ 36, మార్క్‌రామ్ 28, రాహుల్ త్రిపాఠి 20, అభిషేక్ శర్మ (7) , గ్లెన్‌ఫిలిప్స్ 0 తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరారు.
- 15 ఓవర్లు పూర్తి.. సన్‌రైజర్స్ 130 /5
15 ఓవర్లు పూర్తయ్యే సరికి సన్‌రైజర్స్ 130 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ 26, అబ్దుల్ సమద్ 9 పరుగుల మీద బ్యాటింగ్ చేస్తున్నారు.
- ఓకే ఓవర్‌లో 2 వికెట్లు
లక్నో కెప్టెన్ కృనాల్ పాండ్యా ఓకే ఓవర్‌లో రెండు వికెట్లు తీశాడు. తొలుత సన్‌రైజర్స్ కెప్టెన్ ఐడెన్ మార్క్‌రామ్ స్టంపౌట్‌గా పెవిలియన్‌కు పంపిన కృనాల్,, ఆ తరువాతి బంతికి గ్లెన్ ఫిలిప్స్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో సన్ రైజర్స్ 13 ఒవర్లు ముగిసే సరికి 117 పరుగులు చేసింది. క్రీజులో హెన్రిచ్ క్లాసెన్ (21), అబ్దుల్ సమద్(1) ఉన్నారు.
Two unplayable deliveries 🔥🔥@krunalpandya24 leads from the front with a double-strike ⚡️⚡️
— IndianPremierLeague (@IPL) May 13, 2023
Follow the match ▶️ https://t.co/CPUJyBdGYU #TATAIPL | #SRHvLSG pic.twitter.com/TfZs2M9f3s
- మార్క్‌రామ్ స్టంపౌట్
కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ ఐడెన్ మార్క్‌రామ్ స్టంపౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం సన్‌రైజర్ 12 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. క్రీజులోకి గ్లెన్ ఫిలిఫ్స్ వచ్చాడు. హెన్రిచ్ క్లాసెన్ 20 పరుగుల మీద బ్యాటింగ్ చేస్తున్నాడు.
- 11 ఓవర్లు పూర్తి.. సన్‌రైజర్స్ 101/3
11 ఓవర్లు పూర్తయ్యే సరికి సన్‌రైజర్స్ జట్టు 101 పరుగులు చేసింది. ఐడెన్ మార్క్‌రామ్ 27, హెన్రిచ్ క్లాసెన్ 7 పరుగుల మీద బ్యాటింగ్ చేస్తున్నారు.
Caught & bowled, with ease 😎#TATAIPL | #SRHvLSG
— IndianPremierLeague (@IPL) May 13, 2023
Relive how @MishiAmit dismissed the well-set Anmolpreet Singh 🎥🔽 pic.twitter.com/sBkz7VI9XM
- అన్మోల్‌ప్రీత్ సింగ్ ఔట్.. సన్‌రైజర్స్ 82/2
దాటిగా ఆడుతున్న అన్మోల్‌ప్రీత్ సింగ్ వ్యక్తి గత స్కోర్ 36 పరుగుల వద్ద అమిత్ మిశ్రా బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం సన్‌రైజర్స్ 3 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. క్రీజులో ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్ ఉన్నారు.
- పవర్ ప్లే పూర్తి .. సన్‌రైజర్స్ 56/2
పవర్ ప్లే పూర్తయ్యే సరకి సన్‌రైజర్స్ వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది. అన్మోల్‌ప్రీత్ సింగ్ 25, మర్క్‌రమ్ క్రీజులో ఉన్నారు. అంతకు ముందు రాహుల్ త్రిపారి 20Ä, అభిషేక్ శర్మ (7) త్వరగా ఔటయ్యారు.
QDK leaps and takes a classy one-handed catch to send Tripathi back to the pavilion 🧤#SRHvLSG #TATAIPL #IPLonJioCinema #IPL2023 | @LucknowIPL @QuinnyDeKock69 pic.twitter.com/8HsXbXGZ58
— JioCinema (@JioCinema) May 13, 2023
- రాహుల్ త్రిపాఠి ఔట్
పవర్ ప్లే ఆఖరి ఔవర్‌లో సన్ రైజర్స్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి 20 పరుగులు చేసి పెవలియన్‌కు చేరాడు. యష్ ఠాకుర్ బౌలింగ్‌లో డికాక్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
- తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ మూడో ఓవర్ తొలి బంతికి వికెట్ కోల్పోయింది. యద్ధ్‌వీర్ సింగ్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ (7) ఔటయ్యాడు.
- టాస్ గెలిచిన హైదరాబాద్.. బ్యాటింగ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత సీజన్‌లో నేడు రెండు మ్యాచులు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్ మధ్య జరుగుతోంది. ఈ సందర్భంగా టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో తొలుత బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ మార్పులతో బరిలోక దిగుతోంది.
Markram mowa wins the toss🪙& elects to bat at Uppal✨
— JioCinema (@JioCinema) May 13, 2023
Catch the action of #SRHvLSG with #IPLonJioCinema - LIVE & FREE across all telecom operators 👈#IPL2023 #TATAIPL | @SunRisers @LucknowIPLpic.twitter.com/S5NYlbZXlV
ఇరు జట్లు:
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్): క్వింటన్ డి కాక్(కీపర్), కైల్ మేయర్స్, కృనాల్ పాండ్యా(కెప్టెన్), ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్, రవి బిష్ణోరు, యుధ్వీర్ సింగ్ చరక్, అవేష్ ఖాన్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్): అభిషేక్ శర్మ, అన్మోల్‌ప్రీత్ సింగ్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్ (కీపర్), హెన్రిచ్ క్లాసెన్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, టి నటరాజన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఫజల్‌హాక్ ఫరూఖీ.










