Apr 24,2023 22:02

హైదరాబాద్‌ : ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న పోరులో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్లు అద్భుతంగా రాణించి ఢిల్లీ క్యాపిటల్స్‌ను 144 పరుగులకే కట్టడి చేశారు. దీంతో హైదరాబాద్‌ టార్గేట్‌ 145 ఉంది. వాషింగ్టన్‌ సుందర్‌ సూపర్‌ బౌలింగ్‌తో రెచ్చిపోయాడు. ఒకే ఓవర్‌లో 3 వికెట్లు తీసుకున్నాడు. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ టీంలో మనీశ్‌ పాండే 27 బంతుల్లో (34), అక్షర్‌ పటేల్‌ 34 బంతుల్లో (34), మాత్రమే రాణించారు. మిచెల్‌ మార్ష్‌ 20, వార్నర్‌ 21, సర్పరాజ్‌ఖాన్‌ 10, అమన్‌ ఖాన్‌ 4, రిపాల్‌ పటేల్‌ 5, నోకియా 2, కుల్‌దీప్‌ 4, ఇషాంత్‌ శర్శ 1, ఫిల్‌ సాల్ట్‌ గోల్గేన్‌ డక్‌మినహా మిగిలిన వారు విఫలం అయ్యారు. సన్‌ రైజర్స్‌ బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌ 28 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. భువనేశ్వర్‌ కుమార్‌ రెండు వికెట్లు సాధించాడు.

  • మనీశ్ పాండే రనౌట్

27 బంతుల్లో 2 ఫోర్లతో 34 పరుగులు చేసిన మనీశ్ పాండే, వాషింగ్టన్ సుందర్ సూపర్ త్రోకి రనౌట్ అయ్యాడు. ఆఖరి ఓవర్‌ రెండో బంతికి ఆన్రీచ్ నోకియా కూడా రనౌట్ కాగా నాలుగో బంతికి రిపల్ పటేల్ కూడా రనౌట్ అయ్యాడు.

  •    అక్షర్‌ ఔట్‌.. ఢిల్లీ 131/6

జట్టు కష్టల్లో ఉన్నపుడు బ్యాటింగ్‌కు వచ్చిన అక్షర్‌ 34 పరుగులు చేసి ఔటయ్యాడు. భూవి బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. అక్షర్‌ 34 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 34 పరుగులు చేశాడు. క్రీజులోకి రిపాల్‌ పటేల్‌ వచ్చాడు. మనీష్‌ పాండే 26 బంతులో 33 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ఢిల్లీ ప్రస్త్తుతానికి 131 పరుగులు చేసింది.

  •  17వ ఓవర్‌లో హ్యాట్రిక్‌ ఫోర్స్‌..  ఢిల్లీ 128/5

17 ఓవర్‌ వేసిన మయాంక్‌ మార్కండే బౌలింగ్‌లో అక్షర్‌ హ్యాట్రిక్‌ ఫోర్స్‌ బాదాడు. దీంతో ఢిల్లీ స్కోరు 128 పరుగులకు చేరింది. అక్షర్‌ పటేల్‌ 34 , మనీష్‌పాండే 31 పరుగులతో క్రీజులో ఉన్నారు.

నిలకడగా ఆడుతున్న అక్షర్‌, మనీష్‌

అక్షర్‌ పటేల్‌, మనీష్‌పాండే నిలకడగా ఆడుతున్నారు. 15 ఓవర్లు పూర్తయ్యే సమయానికి ఢిల్లీ 113 పరుగులు చేసింది. అక్షర్‌ పటేల్‌ 19 , మనీష్‌పాండే 24 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 13 ఓవర్లలో ఢిల్లీ 91

13 ఓవర్లు పూర్తయ్యే సరికి ఢిల్లీ 5 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. క్రీజులో అక్షర్‌ పటేల్‌ 12 , మనీష్‌పాండే 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 10 ఓవర్లు పూర్తి.. ఢిల్లీ 75/5

10 ఓవర్లు పూర్తయ్యేసరికి ఢిల్లీ జట్టు 75 పరుగులు చేసింది. అక్షర్‌ పటేల్‌ 7 , మనీష్‌పాండే 6 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నారు. అంతకు ముందు మిచెల్‌ మార్ష్‌ 20, వార్నర్‌ 21, సర్పరాజ్‌ఖాన్‌ 10, అమన్‌ ఖాన్‌ 4 ఫిల్‌ సాల్ట్‌ గోల్గేన్‌ డక్‌గా పెవిలియన్‌కు చేరారు.

  • ఒకే ఓవర్‌లో 3 వికెట్లు

ఇన్నింగ్స్ 8వ ఓవర్‌లో ఏకంగా 3 వికెట్లు  సుందర్ తీశాడు. 20 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్‌ని అవుట్ చేసిన వాషింగ్టన్ సుందర్, అదే ఓవర్‌లో సర్ఫరాజ్ ఖాన్, ఆమన్ హకీం ఖాన్ వికెట్లను తీశాడు.  9 బంతుల్లో ఓ సిక్సర్‌తో 10 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్, సుందర్ బౌలింగ్‌లో భువీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

  • మార్ష్‌ ఔట్‌.. ఢిల్లీ 41/2

15 బంతుల్లో 25 పరుగులు చేసిన మిచెల్‌ మార్ష్‌ 20 నటరాజన్‌ బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు. క్రీజులోకి సర్ఫరాజ్‌ ఖాన్‌ వచ్చాడు. వార్నర్‌ 15 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నారు. 5 ఓవర్లకు ఢిల్లీ స్కోర్‌: 41/2

  • 3 ఓవర్లలో 22

3 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ జట్టు 22 పరుగులు చేసింది. మిచెల్‌ మార్ష్‌ దూకుడుగా ఆడుతుండతంతో వార్నర్‌ నెమ్మదిగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ప్రస్తుతానికి మిచెల్‌ మార్ష్‌ 20, వార్నర్‌ 1 పరుగుమీద బ్యాటింగ్‌ చేస్తున్నారు.

  • ఫిల్‌ సాల్ట్‌ డక్‌ఔట్‌

భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో ఫిల్‌ సాల్ట్‌ గోల్డెన్‌ డక్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. భూవి వెసిన బంతిని తప్పుగా అంచనా వేసిని ఫిల్‌సాల్ట్‌ వికెట్‌ కీపర్‌ క్లాసన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. క్రీజులోకి మిచెల్‌ మార్ష్‌ వచ్చాడు.

  • టాస్‌ గెలిచిని ఢిల్లీ .. తొలుత బ్యాటింగ్‌

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుంది. దీంతో సన్‌రైజర్స్‌ జట్టుబౌలింగ్‌ చేయనుంది. కాగా ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌, ఢిల్లీ జట్లు పలు మార్పులతో బరిలోకి దిగనుంది.

ఎస్‌ఆర్‌హెచ్‌: అభిషేక్ శర్మ, హ్యారీ బ్రూక్, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్‌), మయాంక్ అగర్వాల్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్‌ కీపర్‌), మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్

ఢిల్లీ క్యాపిటల్స్ : డేవిడ్ వార్నర్ (కెప్టెన్‌), ఫిలిప్ సాల్ట్ (వికెట్‌ కీపర్‌), మిచెల్ మార్ష్, మనీష్ పాండే, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, రిపాల్ పటేల్, అన్రిచ్ నార్ట్జే, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ