సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఎస్‌ఆర్‌హెచ్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. ''మోకాలి గాయం కారణంగా ఐపీఎల్-2023 సీజన్ నుంచి తప్పుకున్నాడు'' అని ఎస్‌ఆర్‌హెచ్ ట్విటర్‌లో పేర్కొంది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌లో జరిగిన మ్యాచ్‌లో వాషింగ్టన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. బౌలింగ్‌లో మూడు వికెట్లు పడగొట్టిన సుందర్.. బ్యాటింగ్‌లో 24 పరుగులు చేశాడు. గాయం కారణంగా సుందుర్ దూరం కావడం ఎస్‌ఆర్‌హెచ్‌కు గట్టి ఎదురు దెబ్బె.










