ప్రజాశక్తి భీమవరం టౌన్: మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించి హెల్త్ అలవెన్సులు, పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని లేని పక్షంలో జూలై 11 నుంచి రాష్ట్ర వ్యాప్తమున్సిపల్ కార్మికులు సమ్మెకు వెళ్తారని దానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు అన్నారు. శుక్రవారంనాడు సిఐటియు జిల్లా కమిటీ సమావేశం జెఎన్వి గోపాలన్ అధ్యక్షతన పట్టణంలోని సిఐటియు ఆఫీసులో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న వి.ఉమామహేశ్వరరావు ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ నేటికి నెరవేర్చలేదని ప్రస్తుతం కార్మికులు పొందుతున్న హెల్త్ అలవెన్స్లు ఎగ్గొట్టే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులు జీతాలు పెంచకపోవడం దారుణమన్నారు. కనీస వేతనం 26,000 ఇవ్వవలసి ఉన్న కేవలం 15 వేల రూపాయలు ఇచ్చి హెల్త్ అలవెన్సులు 5 నెలలు నుండ ిఆపేసారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే హెల్త్ అలవెన్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు పనిముట్లు ఇవ్వకుండా పని భారం పెంచుతూ కార్మికులు తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరిపి సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అన్ని కార్మిక సంఘాలు జేఏసీ ఏర్పాటు ఈ సమ్మె చేపడుతున్నాయని కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యలు పరిష్కారానికి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజా రామ్మోహన్ రారు మాట్లాడారు కార్మికులపై వేస్తున్న భారాలకు వ్యతిరేకంగా హక్కు లరించ పద్ధతుల్లో నిర్ణయాలు తీసుకుంటున్నారని ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు బి వాసుదేవరావు జె శ్రీనివాస్ ముచ్చర్ల త్రిమూర్తులు పీవీ ప్రతాపు ఎం ఆంజనేయులు డి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.










