Feb 15,2023 15:17

ఢిల్లీ : వెన్ను గాయంతో బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ తొలి టెస్టుకు దూరమైన టీమ్‌ ఇండియా మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ రెండో టెస్టుకు అందుబాటులో ఉండనున్నాడు. బెంగళూర్‌ లోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో నిపుణుల పర్యవేక్షణలో ఫిట్‌నెస్‌పై దృష్టి నిలిపిన అయ్యర్‌.. ఫిబ్రవరి 17 నుంచి న్యూఢిల్లీలో ఆరంభం కానున్న రెండో టెస్టుకు తిరిగి జట్టులో చేరనున్నాడు. భారత్‌కు ఏడు టెస్టులు ఆడిన అయ్యర్‌ 56.72 సగటుతో 624 పరుగులు చేశాడు. శ్రేయస్‌ అయ్యర్‌ గైర్హాజరీతో ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్‌ టెస్టులో అరంగేట్రం చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌ బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది.