May 28,2023 12:59

ఈ ఏడాది భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌ జరగబోతోంది. జూన్‌ 7 నుండి భారత్‌ మరియు ఆస్ట్రేలియా మధ్య ఓవల్‌లో జరిగే ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ తర్వాత 2023 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ ప్రకటిస్తామని బీసీసీఐ కార్యదర్శి జైషా తెలిపారు. వన్డే ప్రపంచ కప్‌ నిర్వహించడానికి భారతదేశంలోని 15 నగరాల్లోని వేదికను సిద్ధం చేసింది. 2023 వన్డే ప్రపంచకప్‌ అక్టోబర్‌ 5 నుంచి నవంబర్‌ 19 మధ్య జరగబోతోంది. మొత్తం 10 దేశాలు పాల్గొనే ఈ టోర్నమెంట్‌ లో 46 రోజుల పాటు 48 మ్యాచులు జరగుతాయి. ఈ నేపథ్యంలో భారత్‌లోని మొత్తం 15 నగరాల్లో వేదికలను షార్ట్‌ లిస్ట్‌ చేశారు. అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గౌహతి, హైదరాబాద్‌, కోల్‌కతా, లక్నో, ఇండోర్‌, రాజ్‌కోట్‌, ముంబై , త్రివేండ్రం, నాగ్‌పూర్‌ , పుణెలో వేదికలుగా మ్యాచులను నిర్వహించాలని చూస్తోంది.