Jun 25,2023 17:01

వెస్టిండీస్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అదరగొట్టిన యువ ఆటగాళ్లు యశస్వీ జైశ్వాల్‌, రుత్‌రాజ్‌ గైక్వాడ్‌లకు సెలక్టర్లు తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు కల్పించారు. అయితే గత కొంత కాలంగా దేశీవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్‌ ఖాన్‌కు మాత్రం మరోసారి నిరాశే ఎదురైంది.
ఈ క్రమంలో భారత సెలక్షన్‌ కమిటీపై మాజీలు తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారు.కాగా టెస్టు జట్టుకు తనని ఎంపిక చేయకపోవడంపై సర్ఫరాజ్‌ ఖాన్‌ స్పందించాడు. . సర్ఫరాజ్‌ రంజీ ట్రోఫీలో తన బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్‌ చేశాడు. అయితే ఈ వీడియోకు సర్ఫరాజ్‌ ఎలాంటి క్యాప్షన్‌ను పెట్టకుండానే వదిలేశాడు. పెట్టి ఒక్క మాట కూడా అనకుండానే సెలెక్టర్లకు గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. సర్ఫరాజ్‌ ఇప్పటివరకు 37 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ల్లో 79.65 సగటుతో 3,505 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు, 9 అర్ధ సెంచరీలున్నాయి. ఇక, జులై 12 నుంచి విండీస్‌, భారత్‌ మధ్య రెండు టెస్టుల సిరీస్‌ ప్రారంభంకానుంది.