ఇంటర్నెట్‌డెస్క్ : ప్రముఖ హీరోయిన్లు మనీషా కొయిరాలా, సోనాలి బింద్రే, మమతామోహన్‌దాస్‌లు బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు వారు విస్తృతంగా ప్రచారం చేసేందుకు కృషి చేశారు. తాజాగా వీరి కోవలోకి ప్రముఖ నటి సమంత కూడా చేరింది. సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధి వల్ల తాను ఎంతో ఇబ్బందికి గురైంది. తాను నటించే సినిమాలకు కొన్నిరోజులు విరామం ఇచ్చి అమెరికాలో ఈ వ్యాధికి చికిత్స తీసుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం మరో ఏడాదిపాటు ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటేనే ఆమె కోలుకుంటోందని తెలుస్తోంది. చికిత్స కోసం విదేశాలకు వెళ్తున్న సమంత.. తాను నటించే సినిమాలకు ముందే అడ్వాన్స్ తీసుకున్న డబ్బుల్ని కూడా నిర్మాతలకు తిరిగి ఇచ్చిందని సినీవర్గాల్లో టాక్ నడుస్తోంది. ఆమె సినిమాలకు విరామం ఇచ్చినా.. మయోసైటిస్ వ్యాధిపై ఆమె విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకుందట. భారత్‌లో ఈ వ్యాధికి సంబంధించి సరైన అవగాహన లేదు. బ్రెస్ట్ క్యాన్సర్ మాదిరిగానే.. మయోసైటిస్‌పై అవగాహన కల్పించడం అవసరమని సామ్ భావించి.. ఆ పనుల్లోనే నిమగమై ఉందని తెలుస్తోంది. సమంత తీసుకున్న నిర్ణయాన్ని పలువురు ఆమెని అభినందిస్తున్నారు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు అని అంటున్నారు.