Apr 26,2023 21:30

ఆర్‌సీబీతో మ్యాచ్‌లో కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. జేసన్‌ రాయ్ 56 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. నితీశ్‌ రానా 48 పరుగులతో ఆకట్టుకున్నాడు. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ మొదలెట్టిన కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌కి ఓపెనర్లు జాసన్‌ రాయ్, నారాయణ్‌ జగదీశన్‌ కలిసి శుభారంభం అందించారు. తొలి వికెట్‌కి 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జగదీశన్‌, 29 బంతుల్లో 4 ఫోర్లతో 27 పరుగులు చేసి విజరుకుమార్‌ వైశాక్‌ బౌలింగ్‌లో డేవిడ్‌ విల్లేకి క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. 29 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 56 పరుగులు చేసిన జాసన్‌ రారాయ్, ఐపీఎల్‌ 2023 సీజన్‌లో వరుసగా రెండో హాఫ్‌ సెంచరీ నమోదు చేసి విజరుకుమార్‌ వైశాక్‌ బౌలింగ్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఈ క్రమంలో నితీశ్‌ రాణా, వెంకటేశ్‌ అయ్యర్‌ కలిసి మూడో వికెట్‌కి 80 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 48 పరుగులు చేసిన నితీశ్‌ రాణా, వానిందు హసరంగ బౌలింగ్‌లో విజరుకుమార్‌ వైశాక్‌కి క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. అదే ఓవర్‌లో వెంకటేశ్‌ అయ్యర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌కి క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. అయ్యర్‌ 26 బంతుల్లో 3 ఫోర్లతో 31 పరుగులు చేశాడు. సిరాజ్‌ ఓవర్‌లో ఆఖరి బంతిని ఫేస్‌ చేసిన ఆండ్రే రస్సెల్‌ 1 పరుగు మాత్రమే చేసి క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. హర్షల్‌ పటేల్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో డేవిడ్‌ వీజ్‌ రెండు సిక్సర్లు బాది స్కోరును 200 దాటించారు. రింకూ సింగ్‌ 10 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 18 పరుగులు చేయగా డేవిడ్‌ వీజ్‌ 3 బంతుల్లో 2 సిక్సర్లతో 12 పరుగులు చేశాడు. ఆర్‌సీబీ బౌలర్లలో హసరంగా, విజయ్ కుమార్‌ వైశాక్‌లు చెరో రెండు వికెట్లు, సిరాజ్‌కు ఒక వికెట్‌ దక్కింది.

  • రసెల్‌ ఔట్‌

సిరాజ్‌ బౌలింగ్‌ రసెల్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. రసెల్‌ 2 బంతుల్లో కేవలం 1 పరుగు మాత్రమే చేశాడు. కేకేఆర్‌ ప్రస్తుతానికి 185 పరుగులు చేసింది. క్రీజులోకి డేవిడ్‌ వైస్‌ వచ్చాడు.

  • 18వ ఓవర్‌లో హసరంగాకు 2 వికెట్లు

18వ ఓవర్‌లో హసరంగాకు 2 వికెట్లు లభించాయి. తొలుత 48 పరుగులు చేసిన కెప్టెన్‌ నితిష్‌ రాణా విజయకుమార్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవలియన్‌కు చేరాడు. క్రీజులోకి వచ్చిన రసెల్‌ సింగిల్‌ తీసి స్ట్రైక్‌ వెంకటేష్‌ అయ్యర్‌కు ఇవ్వగా అయ్యార్‌ ఆ తరువాత బంతిని బారీ షాట్‌కు ప్రయత్నించి మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి రింకు సింగ్‌ వచ్చాడు. కేకేఆర్‌ ప్రస్తుతానికి 170 పరుగులు చేసింది.

  • భారీ స్కోరు దిశగా కేకేఆర్‌.. 16 ఓవర్లకు 150/2

16 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి కేకేఆర్‌ 150 పరుగులు చేసింది. వెంకటేష్‌ అయ్యార్‌, నితిష్‌ రాణా దుకుడుగా ఆడుతూ.. స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ప్రస్తుతానికి వెంకటేష్‌ అయ్యార్‌22 బంతుల్లో 28 పరుగులు చేశాడు. రాణా 16 బంతుల్లో 33 పరుగులు చేశాడు.

  • 14 ఓవర్లలో కేకేఆర్‌ 126/2

14 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్‌ రెండు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. వెంకటేశ్‌ అయ్యర్‌ 20, నితీశ్‌ రానా 18 పరుగులతో ఆడుతున్నారు.

  • 12 ఓవర్లు పూర్తి కేకేఆర్‌ 106/2

12 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్‌ 106 పరుగులు చేసింది. వెంకటేష్‌ అయ్యార్‌ 15, నితిష్‌ రాణా 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  •  రాయ్ ఔట్‌.. కేకేఆర్‌ 88/2

56 పరుగులు చేసిన రారు విజయకుమార్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రారు 29 బంతుల్లో 5 సిక్స్‌లు, 4 ఫోర్లు 56 పరుగులు సాధించాడు. క్రీజులోకి నితిష్‌ రాణా వచ్చాడు. కేకేఆర్‌ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది.

  • తొలి వికెట్‌ డౌన్‌

విజయకుమార్‌ బౌలింగ్‌లో 27 పరుగులు చేసిన జగదీశన్‌ డేవిడ్‌ విల్లికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. జగదీశన్‌ 29 బంతుల్లో 27పరుగులు సాధించాడు. క్రీజులోకి వెంటేశ్‌ అయ్యర్‌ వచ్చాడు. రాయ్ 28 బంతుల్లో 56 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

  • రాయ్ 50.. కేకేఆర్‌ 75/0

కేకేఆర్‌ ఓపెనర్‌ జాసన్‌ రాయ్ 22 బంతుల్లో 50 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. రాయ్ ఇన్నింగ్స్‌లో 5 సిక్స్‌లు, 4 ఫోర్లు ఉన్నాయి. 8 ఓవర్లలో కేకేఆర్‌ వికెట్‌ నష్టపోకుండా 75 పరుగులు చేసింది. జగదీశన్‌ 22 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

  • పవర్‌ ప్లే పూర్తి.. 6 ఓవర్‌లో 4 సిక్స్‌లు

షాబాజ్‌ అహ్మద్‌ వేసిన 6 ఓవర్‌లో రాయ్ 4 సిక్స్‌లు బాదాడు. తొలుత 2,3,4 బంతులను వరుసగా సిక్స్‌లు కొట్టి హ్యట్రిక్‌ సాధించాడు. ఐదో బంతిని డాట్‌ ఆడగా 6వ బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. కాగా పవర్‌ ప్లే పూర్తయ్యే సమయానికి కేకేఆర్‌ వికేట్‌ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. జాసన్‌రాయ్ దుకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. రారు 20 బంతుల్లో 5 సిక్స్‌లు, 4 ఫోర్ల సాయంతో 48 పరుగులు చేశాడు. మరోవైపు జగదీశన్‌ రాయ్ కు మద్దతుగా ఉన్నాడు. 16 బంతుల్లో 17 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

  • 3 ఓవర్లు పూర్తి..  కేకేఆర్‌ 18/0

3 ఓవర్లు పూర్తయ్యే సరికి కేకేఆర్‌ 18 పరుగులు చేసింది. జేసన్‌ రాయ్ 12, జగదీశన్‌ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • టాస్‌ గెలిచిన ఆర్‌సిబి

ఐపీఎల్‌ 16వ సీజన్‌ లీగ్‌ దశలో 36వ మ్యాచ్‌ బెంగళూరు, కోల్‌కతా జట్లు తలపడనున్నాయి. ఈమ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆర్‌సిబి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో కోల్‌కతా జట్టు  బ్యాటింగ్‌ చేయనుంది.
 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ(కెప్టెన్‌), షాబాజ్ అహ్మద్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(వికెట్‌ కీపర్‌), సుయాష్ ప్రభుదేసాయి, వనిందు హసరంగా, డేవిడ్ విల్లీ, విజయ్‌కుమార్ వైషాక్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): ఎన్ జగదీసన్ (వికెట్‌కీపర్‌), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్‌), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, డేవిడ్ వైస్, వైభవ్ అరోరా, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి