Feb 16,2023 14:05

వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు తమ జట్టు పరిమిత ఓవర్ల కొత్త కెప్టెన్‌లను గురువారం ప్రకటించింది. టీ20లకు విధ్వంసకర ఆల్‌రౌండర్‌ రోవ్‌మన్‌ పావెల్‌ ఎంపికవ్వగా..వన్డేలకు సారథిగా సీనియర్‌ ఆటగాడు షాయ్ హౌప్‌ నియమితుడయ్యాడు. మార్చి 16 నుంచి దక్షిణాఫ్రికాతో జరగున్న వన్డే, టీ20 సిరీస్‌లతో సారథిలగా వీళ్ల ప్రయాణం ప్రారంభం కానుంది. కాగా 2019 నుంచి విండీస్‌ వన్డే జట్టుకు హౌప్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటివరకు 104 వన్డే మ్యాచ్‌లు ఆడిన అతడు 48.08 సగటుతో 4308 పరుగులు చేశాడు. రోవ్‌మన్‌ పావెల్‌ కూడా విండీస్‌ జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. గత ఏడాది కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్న జమైకా తల్లావాస్‌కు పావెల్‌ సారథిగా వ్యవహరించాడు.