Mar 03,2023 22:05

గ్వాలియర్‌: ఇరానీ కప్‌లో రెస్టాఫ్‌ ఇండియాకు 190పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యత లభించింది. ఓవర్‌ నైట్‌ స్కోర్‌ మూడు వికెట్ల నష్టానికి 112 పరుగులతో శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన మధ్యప్రదేశ్‌ జట్టు 112.4 ఓవర్లలో 294పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన రెస్టాఫ్‌ ఇండియా జట్టు మూడోరోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోయి 85పరుగులు చేసింది. యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌(58నాటౌట్‌) అర్ధసెంచరీతో మెరిసాడు. దీంతో రెస్టాఫ్‌ ఇండియా జట్టు ఇప్పటికే 275పరుగుల ఆధిక్యతను సంపాదించింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో రెస్టాఫ్‌ ఇండియా 484పరుగుల భారీ స్కోర్‌ను చేసిన సంగతి తెలిసిందే.