May 08,2023 07:15
  • బట్లర్‌ 95 పరుగులు వృదా

జైపూర్‌ :సన్‌ రైజర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ పోరులో ఆఖర్లో హైడ్రామా చోటుచేసుకోగా, చివరి బంతికి సిక్స్‌ బాదిన అబ్దుల్‌ సమద్‌ సన్‌ రైజర్స్‌ కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. సన్‌ రైజర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ పోరులో చివరి బంతికి హైడ్రామా చోటు చేసుకుంది. చివరి బంతికి సన్‌ రైజర్స్‌ గెలవాలంటే 5 పరుగులు చేయాలి. సందీప్‌ శర్మ వేసిన ఆఖరి బంతినిఅబ్దుల్‌ సమద్‌ భారీ షాట్‌ కొట్టే యత్నంలో లాంగ్‌ ఆఫ్‌ లో క్యాచ్‌ ఇచ్చాడు. దాంతో సన్‌ రైజర్స్‌ ఓడిపోయిందని అంతా అనుకున్నారు. అంపైర్‌ అది నోబాల్‌ గా డిక్లేర్‌ చేయగానే... సన్‌ రైజర్స్‌ జట్టు ఆనందంలో మునిగిపోయింది. ఇక చివరి బంతికి 4 పరుగులు కావాల్సి ఉండగా.. సమద ్‌బంతిని నేరుగా సిక్స్‌ కొట్టి సన్‌ రైజర్స్‌ను గెలిపించాడు.


ఓపెనర్లు అన్‌ మోల్‌ ప్రీత్‌ సిగ్‌ (33), అభిషేక్‌ శర్మ (55) తొలి వికెట్‌కు 51 పరుగులు చేసి శుభారంభం అందించగా... వన్‌ డౌన్‌ లో వచ్చిన రాహుల్‌ త్రిపాఠి 29 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సులతో 47 పరుగులు చేసి సన్‌ రైజర్స్‌ స్కోరుబోర్డును పరుగులు తీయించాడు. వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌ మెన్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ (12 బంతుల్లో 26) తనవంతు సహకారం అందించాడు. క్లాసెన్‌, కెప్టెన్‌ ఐడెన్‌ మార్‌ క్రమ్‌ (7) కొద్ది వ్యవధిలోనే అవుట్‌ కావడంతో సన్‌ రైజర్స్‌ ఓటమి బాటలో పయనిస్తున్నట్టు అనిపించింది. అయితే, ఆఖర్లో గ్లెన్‌ ఫిలిప్స్‌ కేవలం 7 బంతుల్లో 25 పరుగులు చేసి మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చివేశాడు.

2

సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌: అన్మోల్‌ప్రీత్‌ (సి) హెట్‌మయర్‌ (బి) చాహల్‌ 33; అభిషేక్‌ (సి) చాహల్‌ (బి) ఆర్‌.అశ్విన్‌ 55; త్రిపాఠి (సి) యశస్వి (బి) చాహల్‌ 47; క్లాసెన్‌ (సి) బట్లర్‌ (బి) చాహల్‌ 26; మార్‌క్రమ్‌ ఎల్బీ (బి) చాహల్‌ 6; ఫిలిప్స్‌ (సి) హెట్‌మయర్‌ (బి) కుల్‌దీప్‌ 25; సమద్‌ నాటౌట్‌ 17; జాన్సన్‌ నాటౌట్‌ 3; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 217;

వికెట్ల పతనం: 1-51, 2-116, 3-157, 4-171, 5-174, 6-196; 

బౌలింగ్‌: సందీప్‌ 4-0-48-0; కుల్‌దీప్‌ యాదవ్‌ 4-0-50-1; ఆర్‌.అశ్విన్‌ 4-0-35-1; చాహల్‌ 4-0-29-4; ఎం.అశ్విన్‌ 3-0-42-0; మెకాయ్‌ 1-0-13-0

  • బట్లర్‌ బాదేశాడు

ముంబయి ఇండియన్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో వరుస పరాజయాలు చవిచూసిన రాజస్థాన్‌ రాయల్స్‌.. మానసికంగా బలహీనంగా ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై దండయాత్ర చేసింది. పరుగుల వేటలో నెమ్మదించిన జోశ్‌ బట్లర్‌, సంజు శాంసన్‌ సైతం సన్‌రైజర్స్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ధనాధన్‌ ఇన్నింగ్స్‌లో ఫామ్‌ అందుకున్నారు. 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 59 బంతుల్లోనే 95 పరుగులు చేసిన జోశ్‌ బట్లర్‌ రాజస్థాన్‌ రాయల్స్‌కు భారీ స్కోరు అందించాడు. కెప్టెన్‌ సంజు శాంసన్‌ (66 నాటౌట్‌, 38 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో విరుచుకుపడ్డాడు. జోశ్‌ బట్లర్‌, సంజు శాంసన్‌ విశ్వరూపంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 2 వికెట్లకు 214 పరుగుల భారీ స్కోరు చేసింది.
బట్లర్‌ మెరుపులు : టాస్‌ నెగ్గిన రాజస్థాన్‌ రాయల్స్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆరంభం నుంచే ఎదురుదాడికి వెళ్లి గత రెండు మ్యాచుల్లో దెబ్బతిన రాజస్థాన్‌ రాయల్స్‌.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై పంథా మార్చుకోలేదు.
టాప్‌ ఆర్డర్‌లో ముగ్గురు కీలక బ్యాటర్లు మెరవటంతో రాజస్థాన్‌ రాయల్స్‌ తడాఖా చూపించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (35, 18 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), జోశ్‌ బట్లర్‌ (95, 59 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 54 పరుగులు జోడించి శుభారంభం అందించారు. పవర్‌ప్లేలో జైస్వాల్‌ దూకుడుగా ఆడాడు. జైస్వాల్‌ వికెట్‌ కోల్పోయినా.. ఆరు ఓవర్లలో 61 పరుగులు జోడించింది. జోశ్‌ బట్లర్‌కు సంజు శాంసన్‌ జత కలవటంతో రాయల్స్‌ ఇన్నింగ్స్‌ దూకుడు పట్టాలెక్కింది. ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 32 బంతుల్లోనే జోశ్‌ బట్లర్‌ అర్థ సెంచరీ సాధించగా.. రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 33 బంతుల్లో సంజు శాంసన్‌ ఫిఫ్టీ అందుకున్నాడు. ఓ ఎండ్‌లో బట్లర్‌, మరో ఎండ్‌లో శాంసన్‌ ఎడాపెడా బౌండరీలు బాదటంతో సన్‌రైజర్స్‌ బౌలర్లు తేలిపోయారు. సెంచరీ ముంగిట జోశ్‌ బట్లర్‌ నిష్క్రమించినా.. సంజు శాంసన్‌ మెరుపు ముగింపు అందించాడు. షిమ్రోన్‌ హెట్‌మయర్‌ (7 నాటౌట్‌) అజేయంగా నిలిచాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌, మార్కో జాన్సెన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.
భువనేశ్వర్‌ కుమార్‌, మార్కో జాన్సెన్‌ నాలుగు ఓవర్లలో 44 పరుగుల చొప్పున సమర్పించుకున్నారు. మాయగాడు మయాంక్‌ మార్కండె ఏకంగా 51 పరుగులు సమర్పించుకుని అర్థ సెంచరీ కొట్టాడు.
స్కోరు వివరాలు :
రాజస్థాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌ : యశస్వి జైస్వాల్‌ (సి) నటరాజన్‌ (బి) మార్కో జాన్సెన్‌ 35, జోశ్‌ బట్లర్‌ (ఎల్బీ) భువనేశ్వర్‌ కుమార్‌ 95, సంజు శాంసన్‌ నాటౌట్‌ 66, షిమ్రోన్‌ హెట్‌మయర్‌ నాటౌట్‌ 7, ఎక్స్‌ట్రాలు : 11, మొత్తం : (20 ఓవర్లలో 2 వికెట్లకు) 214.
వికెట్ల పతనం : 1-54, 2-192.
బౌలింగ్‌ : భువనేశ్వర్‌ కుమార్‌ 4-0-44-1, మార్కో జాన్సెన్‌ 4-0-44-1, నటరాజన్‌ 4-0-36-0, మయాంక్‌ మార్కండె 4-0-51-0, అభిషేక్‌ శర్మ 2-0-15-0, వివ్రాంత్‌ శర్మ 2-0-18-0.