రాజస్థాన్ నిర్ధేశించిన భారీ స్కోరును చేదించే క్రమంలో ఢిల్లీ తొలి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. వరుస బంతుల్లో రెండు వికెట్లు కొల్పోయి కష్టలో పడింది. ఇప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ఓపెనర్ పృథ్వీషా డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. బౌల్ట్ వేసిన తొలి ఓవర్ 3వ బంతికే కీపర్ సంజుశాంసన్‌కు క్యాచ్ ఇచ్చాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన మనిష్‌పాండే ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో ఢిల్లీ పరుగులేమి చేయకుండా రెండు వికెట్ కొల్పొయింది. క్రీజులోకి రోవ్‌మన్ పావెల్ వచ్చాడు.
- రాజస్థాన్ 199/4.. ఢిల్లీ టార్గెట్ 200
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ భారీ స్కోరు చేసింది. 4 వికెట్ల నష్థానికి 199 పరుగులు చేసి ఢిల్లీ ముందు భారీ టార్గేట్‌ను ఉంచింది. రాజస్థాన్.. ఓపెనర్లు యశస్వి (31 బంతుల్లో 11 ఫోర్లు 1 సిక్స్ సాయంతో 60 పరుగులు చేశాడు. బట్లర్ 51 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 79 పరుగులు చేశాడు. చివరిలో హెట్‌మైర్ 21 బంత్లో 1 ఫొర్ 4 సిక్స్ సాయంతో 39 పరుగులు చేశాడు. సంజుశాంసన్ డకౌట్‌కాగా రియాన్ పరాగ్ 7 పరుగులు మాత్రమే చేశాడు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ 2, కుల్దీప్, రోవ్‌మన్ పావెల్ తలో వికెట్ తీసుకున్నారు.
- బట్లర్ 79 ఔట్
79 పరుగులు చేసిన బట్లర్ ముకేష్‌కుమార్ బౌలింగ్‌లో క్యాచ్&బౌల్డ్‌గా పెవిలియన్‌కు చేరాడు. బట్లర్ 51 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 79 పరుగులు చేశాడు. క్రీజులోకి ధ్రువ్ జురెల్ వచ్చాడు. ప్రస్తుతానికి రాజస్థాన్ 18.3 ఓవర్లలో 175 పరుగులు చేసింది.
- పరాగ్ ఔట్.. రాజస్థాన్ 129/3
రాజస్థాన్ రాయల్స్ 3వ వికెట్ కోల్పొయింది. 7 పరుగులు చేసిన రియాన్ పరాగ్ రోవ్‌మన్ పావెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి షిమ్రాన్ హెట్మెయర్ వచ్చాడు. బట్లర్ 55 పరుగుతో బ్యాటింగ్ చేస్తున్నాడు.
- బట్లర్ 50..
రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ బట్లర్ 50 పరుగులు చేశాడు. 34 బంతుల్లో 7 ఫోర్లు 1సిక్స్ సాయంతో హఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం రాజస్ధాన్ 13 ఓవర్లలో 122 పరుగులు చేసింది. క్రీజులో రియాన్ పరాగ్ 6 పరుగులతో ఉన్నాడు.
- సంజు శాంసన్ డక్ ఔట్..
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజుశాంసన్ డకౌట్ అయ్యాడు. కుల్‌దీప్‌యాదవ్ బౌలింగ్‌లో అన్రిచ్ నార్జేకి క్యాచ్‌ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. రాజస్థాన్ ప్రస్తుతం 2 వికెట్ల నష్లానికి 103పరుగులు చేసింది. క్రీజులోకి రియాన్ పరాగ్ వచ్చాడు. బట్లర్ 24 బంతుల్లో 40 పరుగులు చేశాడు.
- జైస్వాల్ ఔట్..
దుకుడుగా ఆడుతున్న జైస్వాల్ 60 పరుగుల వద్ద ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో క్యాచ్&బౌల్డ్‌గా పెవిలియన్‌కు చేరాడు. జైస్వాల్ 31 బంతుల్లో 11 ఫోర్లు 1 సిక్స్ సాయంతో 60 పరుగులు చేశాడు. క్రీజులోకి సంజు శాంసన్ వచ్చాడు. బట్లర్ 20 బంత్లో 35 పరుగులతో క్రీజులో ఉన్నాడు. రాజస్థాన్ 9 ఓవర్లు ముగిసే సరికి 9 పరుగులు చేసింది.
- జైస్వాల్ 50..
ఓపెనర్ జైస్వాల్ 25 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. జైశ్వాల్ ఇన్నింగ్స్‌లో 11 బౌండరీలు ఉన్నాయి. ప్రస్తుతం రాజస్థాన్ 7 ఓవర్లు ముగిసే సరికి 79 పరుగులు చేసింది. బట్లర్ 16 బంతుల్లో 25 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
- ముగిసిన పవర్ ప్లే.. రాజస్థాన్ 68/0
పవర్ ప్లే ముగిసే సమయానికి రాజస్తాన్ 68 పరుగులు చేసింది. ఓపెనర్ జైస్వాల్,బట్లర్ దాటిగా ఆడుతున్నారు. జైస్వాల్ తొలి ఓవర్‌లో ఏకంగా 5 బౌండరీలు బాదగా, 5 ఓవర్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో మరో 3 బౌండరీలు బాదాడు. ఫలితంగా జైస్వాల్ చేసిన 41 పరుగుల్లో 36 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి. మరోవైపు జైస్వాల్‌కు మద్దతుగా బట్లర్ 14 బంతుల్లో 24 పరుగులు చేశాడు. అందులో 5 బౌండరీల రూపంలోనే వచ్చాయి.
- 4 ఓవర్లుకు 50
4 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్ దాటిగా ఆడుతూ.. స్కోర్‌బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. జైస్వాల్ 12 బంతుల్లో 27 (6 ఫోర్లు), బట్లర్ 12 బంతుల్లో 20 పరుగులు (4 ఫోర్లు) బ్యాటింగ్ చేస్తున్నారు.
- జైస్వాల్ 5 బౌండరీలు
ఓపెనర్ జైస్వాల్ తొలి ఓవర్‌లో ఏకంగా 5 బౌండరీలు బాదగా.. మరో ఓపెనర్ జోస్ బట్లర్ రెండో ఓవర్‌లో మూడు ఫోర్లు కొట్టాడు. ఫలితంగా ఆ జట్టు స్కోర్ 2 ఓవర్ల తర్వాత 32/0గా ఉంది.
- టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్.. రాజస్థాన్ బ్యాటింగ్
ఐపీఎల్-2023లో భాగంగా బర్సపరా క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ, రాజస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రాజస్తాన్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ స్థానంలో రోవ్ మాన్ పావెల్ ను తీసుకున్నారు. సర్ఫరాజ్ ఖాన్ స్థానంలో లలిత్ కు స్థానం కల్పించారు. మనీశ్ పాండే మళ్లీ జట్టులోకి వచ్చాడు. రాజస్తాన్ కూడా పలు మార్పులతో బరిలోకి దిగనుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్): డేవిడ్ వార్నర్ (సి), మనీష్ పాండే, రిలీ రోసోవ్, రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్ , అన్రిచ్ నార్ట్జే, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్): జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హౌల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజువేంద్ర చాహాల్










