Sep 15,2023 16:10

తెలంగాణ : తెలంగాణలో మరో మూడు,నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే సూచనలున్నాయని పేర్కొంది.శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.శనివారం నుంచి బుధవారం వరకు చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదవుతుందని వివరించింది. ఇదిలా ఉండగా.. శుక్రవారం ఉదయం వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం, వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో మోస్తరు వర్షాపాతం నమోదైందని టీఎస్‌డీపీఎస్‌ వివరించింది.