మహిళల ప్రీమియర్ లీగ్‌లో భాగంగా బుధవారం ఆర్‌సీబీ , గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ బ్యాటింగ్ ఏంచుకుంది. ఆర్‌సీబీతో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ సోఫియా డంక్లీ(28 బంతుల్లో 65 పరుగులు) విధ్వంసానికి తోడుగా హర్లిన్ డియోల్(45 బంతుల్లో 67 పరుగులు) చేయడంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఆర్‌సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్, హెథర్‌నైట్‌లు చెరో రెండు వికెట్లు తీశారు.










