- ఢిల్లీపై 31పరుగుల తేడాతో గెలుపు
న్యూఢిల్లీ : ప్లే ఆఫ్స్ ఛాన్స్ దక్కడం కష్టమే అనుకున్న దశలో పంజాబ్ జట్టు ఢిల్లీపై 31 పరుగుల తేడాతో గెలిచి ప్లే-ఆఫ్ రేసులోకి వచ్చింది. తొలుత ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్(103) సెంచరీతో కదం తొక్కడంతో పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 167 పరుగులే చేసింది. ఛేదనలో హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్ స్పిన్ ధాటికి ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యే సరికి 8 వికెట్లు కోల్పోయి 136పరుగులే చేసి పరాజయాన్ని చవిచూసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు శుభారంభం దక్కలేదు. రెండో ఓవర్లోనే శిఖర్ ధావన్(7) ఔటయ్యాడు. ఇషాంత్ తన రెండో ఓవర్లో లివింగ్‌స్టోన్(4)ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్, జితేశ్ శర్మ(5)ను బౌల్డ్ చేశాడు. దాంతో, పవర్ ప్లే ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్(103) సెంచరీతో చెలరేగాడు. 61 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ చేశాడు. మిగతా ఆటగాళ్లంతా విఫలమైనా అతను సంచలన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ప్రభ్‌సిమ్రాన్‌కి తోడు సామ్ కరన్(20) ఆదుకున్నాడు. దూకుడుగా ఆడిన ప్రభ్‌సిమ్రాన్ ఐపీఎల్‌లో తొలి సెంచరీ బాదాడు. సికిందర్ రాజా(11 నాటౌట్) పంజాబ్ స్కోర్ 160 దాటించాడు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ రెండు, కుల్దీప్ యాదవ్, ముఖేశ్ కుమార్, అక్షర్ పటేల్, ప్రవీణ్ దూబే తలా ఒక వికెట్ పడగొట్టారు. ఛేదనలో ఢిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్(54) ఒక్కడే రాణించాడు. ఓపెనర్ ఫిలిఫ్ సాల్ట్(21), మిచెల్ మార్ష్(3), రిలే రస్సో(5), అక్షర్ పటేల్(1), ఇంపాక్ట్ ప్లేయర్ మనీశ్ పాండే(0) విఫలమయ్యారు. హర్‌ప్రీత్ బ్రార్ నాలుగు, ఎల్లీస్, రాహుల్ చాహర్‌కు రెండేసి వికెట్లు దక్కాయి.
స్కోర్‌బోర్డు..
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ : ప్రభ్‌సిమ్రన్ (బి)ముఖేశ్ కుమార్ 103, ధావన్ (సి)రోషా (బి)ఇషాంత్ 7, లివింగ్‌స్టోన్ (బి)ఇషాంత్ 4, జితేశ్ శర్మ (బి)అక్షర్ 5, సామ్ కర్రన్ (సి)హకీమ్ ఖాన్ (బి)ప్రవీన్ దూబే 20, హర్‌ప్రీత్ బ్రార్ (సి)మిఛెల్ మార్ష్ (బి)కుల్దీప్ యాదవ్ 2, షారుక్ ఖాన్ (రనౌట్)సాల్ట్/ఖలీల్ అహ్మద్ 2, సికిందర్ రాజా (నాటౌట్) 11, రిషీ ధావన్ (నాటౌట్) 0, అదనం 13. (20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 167పరుగులు. వికెట్ల పతనం: 1/10, 2/32, 3/45, 4/117, 5/129, 6/154, 7/165 బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4-0-36-0, ఇషాంత్ 3-0-27-2, అక్షర్ పటేల్ 4-0-27-1, ప్రవీన్ దూబే 3-0-19-1, కుల్దీప్ యాదవ్ 4-0-32-1, మిఛెల్ మార్ష్ 1-0-21-0, ముఖేశ్ కుమార్ 1-0-3-1.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ : ధావన్ (ఎల్‌బి)హర్‌ప్రీత్ బ్రార్ 54, ఫిలిప్ సాల్ట్ (బి)హర్‌ప్రీత్ బ్రార్ 21, మిఛెల్ మార్ష్ (ఎల్‌బి)రాహుల్ చాహర్ 3, రోషా (సి)రాజా (బి)హర్‌ప్రీత్ బ్రార్ 5, అక్షర్ పటేల్ (ఎల్‌బి)రాహుల్ చాహర్ 1, మనీష్ పాండే (బి)హర్‌ప్రీత్ బ్రార్ 0, హకీమ్ ఖాన్ (సి)హర్‌ప్రీత్ బ్రార్ (బి)నాథన్ ఎల్లీస్ 16, ప్రవీన్ దూబే (బి)నాథన్ ఎల్లీస్ 16, కుల్దీప్ యాదవ్ (నాటౌట్) 10, ముఖేష్ కుమార్ (నాటౌట్) 6, అదనం 4. (20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి) 136పరుగులు. వికెట్ల పతనం: 1/69, 2/74, 3/81, 4/86, 5/86, 6/88, 7/118, 8/123 బౌలింగ్: రిషీ ధావన్ 1-0-10-0, సామ్ కర్రన్ 2-0-18-0, హర్‌ప్రీత్ బ్రార్ 4-0-30-4, నాథన్ ఎల్లీస్ 4-0-26-2, ఆర్ష్‌దీప్ సింగ్ 4-0-32-0, రాహుల్ చాహర్ 4-0-16-2, సికిందర్ రాజా 1-0-3-0.










