Aug 22,2022 12:33

ఏలూరు : ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌ పథకాన్ని అమలు చేయాలని కోరుతూ ... కెవిపిఎస్‌ కమిటీ ఆధ్వర్యంలో కెవిపిఎస్‌ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ... బుట్టాయిగూడెం విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ వద్ద ప్రజా సంఘాలు సోమవారం నిరసన చేపట్టారు. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌ పథకాన్ని అమలు చేయాలని, 300 వరకు పెంచాలని, 793 జి ఓ ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కెవిపిఎస్‌ ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ.ఫ్రాన్సిస్‌ మాట్లాడుతూ ... కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో విద్యుత్తు సవరణ బిల్లు తీసుకొచ్చిందని, ఈ బిల్లును వ్యతిరేకించాలని ప్రజాసంఘాలన్ని ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. 2019లో ఎస్సీ ఎస్టీలకు ఎపి రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్లు సబ్సిడీ ఇచ్చింది కానీ ఆ సబ్సిడీని ఆ పథకానికి తూట్లు పొడిచే పద్ధతిలో 793 జిఒ ను తీసుకొచ్చారని, ఆ జిఒ ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టి.రాజు, బి.డేవిడ్‌ రాజ్‌, డి.శికామణి, ధర్మరాజు, యేసు రత్నం, జి.ఏలియా, నున్న సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.