Sep 26,2023 13:11

ప్రజాశక్తి - చీరాల (బాపట్ల) : అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్భంధం, అక్రమ అరెస్టులను వ్యతిరేకిస్తూ... సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం చీరాల గడియార స్తంభం సెంటర్‌లో నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. సిఐటియు నాయకులను అరెస్టు చేసి ఒకటవ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు.