Oct 18,2023 14:36

హైదరాబాద్‌ : ప్రవళిక ఆత్మహత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆమె ప్రియుడు శివరామ్‌ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడి వేధింపుల వల్లనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. ప్రవళిక ఆత్మహత్యతో పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన చేసిన వారిపై కేసులు నమోదవుతున్నాయి.13 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌లో శివరామ్‌ అనే యువకుడి వేధింపుల కారణంగానే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబసభ్యులు పేర్కొన్నారు. తమ బిడ్డ చావును రాజకీయం చేయవద్దని కోరారు. ఏమైనా రాజకీయాలు ఉంటే పార్టీలే చూసుకోవాలని, బిడ్డను కోల్పోయిన ద్ణుఖంలో తాము ఉన్నామని.. పరామర్శలతో, ప్రశ్నలతో తమను వేధించవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ప్రవళిక తల్లి విజయ, సోదరుడు ప్రణరు వేర్వేరు వీడియోలను విడుదల చేశారు. తాను గ్రామంలో కూలీ పనులకు వెళ్తానని.. తన పిల్లలు ప్రవళిక, ప్రణరుకు మంచి చదువులు చెప్పించేందుకు రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు పంపినట్లు వీడియోలో విజయ తెలిపింది.