Mar 08,2023 10:04

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం(8న) జరిగే డబ్ల్యూపీఎల్‌ మ్యాచ్‌ టికెట్లను ఉచితంగా అందించనున్నట్లు బీసీసీఐ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. డబ్ల్యూపీఎల్‌లో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ముంబయి వేదికగా జరిగే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వర్సెస్‌ గుజరాత్‌ జెయింట్స్‌ మ్యాచ్‌ టిక్కెట్లు ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది. ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మ్యాచ్‌లకు మహిళా ప్రేక్షకులను ఇప్పటికే ఉచితంగా అనుమతిస్తోంది.