ప్రజాశక్తి ప్రత్యేకప్రతినిధి-అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దనరా నాటికి విశాఖకు తరలివెడతారన్న ప్రచారం ఒకనైపు సాగుతుండగా మరోవైపు అధికార యంత్రాంగానికి ఆ దిశలో ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు. వివిధ శాఖాధిపతులు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. అధికారికంగా కాదు కదా, మౌఖికంగా కూడా ఎటువంటి సమాచారం లేదని వారు స్పష్టం చేస్తున్నారు. దీంతో సిఎం క్యాంపు కార్యాలయాన్ని మాత్రం తరలించే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. అదే జరిగితే సమీక్షలకు అధికారులు అక్కడకు వెళ్లవలసి ఉంటుంది. అది ఆర్థికంగా భారమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.










