శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. స్వదేశంలో లంకతో తలపడనున్న జట్టులో 13 మంది సభ్యులకు చోటిచ్చింది. ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడిన జట్టునే కొనసాగించింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 సీజన్‌లో భాగంగా కివీస్- లంక మధ్య రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. క్రైస్ట్‌చర్చ్, వెల్లింగ్‌టన్‌లలో జరుగనున్న ఈ సిరీస్ శ్రీలంకకు కీలకంగా మారింది.
- న్యూజిలాండ్ జట్టు ఇదే
టిమ్ సౌథీ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్), మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, బ్లెయిర్ టిక్నర్, నీల్ వాగర్, స్కాట్ కుగ్గెలీజన్, హెన్రీ నికోల్స్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్.










