Oct 02,2023 19:54

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ప్రాంతీయ వాదం పెరగడంతో జాతీయ భావన లేకుండా పోతోందని, ప్రతిఒక్కరిలో జాతీయ భావం పెంపొందించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం మహాత్మాగాంధీ, లాల్‌ బహదూర్‌శాస్త్రికి నివాళులర్పించారు. రాష్ట్రంలో పాలకులు అసహనంతో ఎస్‌సి, ఎస్‌టి కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారన్నారు. నాణ్యత లేని మద్యాన్ని అమ్ముతూ డబ్బు దండుకునేందుకు జేబులు నింపుకుంటున్నారని విమర్శించారు.