Sep 21,2023 15:28

కూచిపూడి: కృష్ణా జిల్లా మొవ్వ మండలం అయ్యంకిలో దారుణం జరిగింది. పాత కక్షల నేపథ్యంలో భార్యాభర్తలను దుండగులు దారుణంగా నరికి చంపారు. అయ్యంకి పంచాయతీ కార్యాలయం వద్ద భర్త వీరంకి వీరకృష్ణను హత్య చేయగా.. నడిరోడ్డుపైనే అతడి భార్య వరలక్ష్మిని కిరాతకంగా నరికి చంపారు.ఘటనా స్థలానికి చేరుకున్న కూచిపూడి పోలీసులు.. పాత కక్షలు నేపథ్యంలోనే జంట హత్యలు జరిగినట్లు ప్రాథమికంగా తేల్చారు. ఈ హత్యలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.