- ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఘన విజయం
ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో మంబై బౌలర్ ఆకాశ్ మధ్వాల్ విజృంభించడంతో లక్నో ఇంటి ముఖం పట్టింది. 183 పరుగుల లక్ష్యఛేదనలో లక్నో జట్టు 16.3 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. ముంబై ఇండియన్స్ 81 పరుగుల భారీ తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ ను చిత్తు చేసింది. మధ్వాల్ కేవలం 5 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. లక్నో బ్యాటర్లలో మార్కస్ స్టొయినిస్ 27 బంతుల్లోనే 40 పరుగులు చేశాడు. ఓపెనర్ కైల్ మేయర్స్ (18), ప్రేరక్ మన్కడ్ (3), కెప్టెన్ కనాల్ పాండ్యా (8), దీపక హుడా (11),ఆయుష్ బదోని (1), పూరన్ (0) నిరాశపరిచారు. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్ 3.3 ఓవర్లలో 5 వికెట్లు పడగొట్టగా, క్రిస్ జోర్డాన్ 1, పియూష్ చావ్లా 1 వికెట్ తీశారు.

ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన ముంబయి జట్టు క్వాలిఫయర్-2కి అర్హత సాధించింది. ఈ నెల 26న జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది. నేటి మ్యాచ్ లో ఓటమితో లక్నో సూపర్ జెయింట్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ముంబై ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (సి) పూరన్ (బి) యశ్ 15బీ రోహిత్ (సి) బదోని (బి) నవీనుల్ 11బీ గ్రీన్ (బి) నవీనుల్ 41బీ సూర్యకుమార్ (సి) గౌతమ్ (బి) నవీనుల్ 33బీ తిలక్ (సి) హుడా (బి) నవీనుల్ 26బీ టిమ్ డేవిడ్ (సి) హుడా (బి) యశ్ 13బీ నేహాల్ (సి) బిష్ణోరు (బి) యశ్ 23బీ జోర్డాన్ (సి) హుడా (బి) మోసిన్ 4బీ షోకీన్ నాటౌట్ 0బీ ఎక్స్‌ట్రాలు 16 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 182బీ వికెట్ల పతనం: 1-30, 2-38, 3-104, 4-105, 5-148, 6-159, 7-168, 8-182బీ బౌలింగ్: కనాల్ 4-0-38-0బీ గౌతమ్ 1-0-8-0బీ నవీనుల్ 4-0-38-4బీ యశ్ 4-0-34-3బీ మోసిన్ 3-0-24-1బీ బిష్ణోయ్ 4-0-30-0
లక్నో ఇన్నింగ్స్ : మేయర్స్ (సి) గ్రీన్ (బి) జోర్డాన్ 18బీ ప్రేరక్ (సి) షోకీన్ (బి) మధ్వాల్ 3బీ కనాల్ (సి) డేవిడ్ (బి) చావ్లా 8బీ స్టాయినిస్ రనౌట్ 40బీ బదోని (బి) మధ్వాల్ 1బీ పూరన్ (సి) ఇషాన్ కిషన్ (బి) మధ్వాల్ 0బీ దీపక్ హుడా రనౌట్ 15బీ గౌతమ్ రనౌట్ 2బీ బిష్ణోరు (సి) జోర్డాన్ (బి) మధ్వాల్ 3బీ నవీనుల్ నాటౌట్ 1బీ మోసిన్ ఖాన్ (బి) మధ్వాల్ 0బీ ఎక్స్‌ట్రాలు 10 మొత్తం (16.3 ఓవర్లలో ఆలౌట్) 101బీ వికెట్ల పతనం: 1-12బీ 2-23బీ 3-69బీ 4-74బీ 5-74బీ 6-89బీ 7-92బీ 8-100బీ 9-100బీబీ బౌలింగ్: బెరెన్‌డార్ఫ్ 3-0-21-0బీ మధ్వాల్ 3.3-0-5-5బీ జోర్డాన్ 2-1-7-1బీ గ్రీన్ 3-0-15-0బీ షోకీన్ 1-0-18-0బీ చావ్లా 4-0-28-1










